మహాశివరాత్రిని పురస్కరించుకుని పునఃనిర్మించిన కల్యాణ మండపాన్ని రాష్ట్ర మంత్రులతో కలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పునఃప్రారంభించారు. అనంతరం యాగశాలలో శాంతి హోమం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వేయి స్తంభాల గుడి కట్టేందుకు 72 ఏండ్ల పట్టిందన్నారు.
మధ్యయుగంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని తెలిపారు. పునఃనిర్మాణం చేసిన కల్యాణమండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేశామన్నారు. దీనివల్లే సంపూర్ణమైన వేయి స్తంభాల దేవాలయం పూర్తయిందని వెల్లడించారు.