Tuesday, November 26, 2024

భాగ్యలక్ష్మీ ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు.. మరికొద్దిసేపటిలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు

హైద‌రాబాద్ – కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఇతర నేతలతో వచ్చిన కిషన్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చార్మినార్ అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టి ఉమా మహేంద్ర కేంద్ర మంత్రికి శాలువా వేసి తల్వార్ అంద‌జేసి స‌త్క‌రించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అక్కడి నుంచి బషీర్ భాగ్ లోని కనకదుర్గ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర , దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఖైరతాబాద్ ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు అట్లనే శ్రీ ఉప్పల్ ఎక్స్ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ రావు , మహాకాళి జిల్లా అధ్యక్షులు శ్రీ గౌతమ్ రావోజి , భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సామ సురేందర్ రెడ్డి , గోల్కొండ జిల్లా అధ్యక్షుడు పండు యాదవ్ , చార్మినార్ బిజెపి (అసెంబ్లీ కన్వీనర్) కే సురేందర్,గోల్కొండ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కునాల్ రావు చ‌ బిజెపి ఎస్సీ మూర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రవీణ్ బాగడి , బజార్ డివిజన్ ఓ బి సి మోర్చా అధ్యక్షుడు ముఖేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు..

కాగా, మ‌రికొద్దిసేప‌టిలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఈ ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కిషన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, తెలంగాణ ఏర్పడిన 2014లో ఓసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement