రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నూతన జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి, మెతుకు ఆనంద్ తో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిశారు. ఇటీవల రాష్ట వ్యాప్తంగా 33 జిల్లాల అధ్యక్షులను నియమించిన విషయం తెలిసిందే. వరుస భేటీలో భాగంగా శుక్రవారం మంత్రి కేటీఆర్ ను కలిశారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృధి కోసం కృషి చేస్తామని అధ్యక్షులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..