Tuesday, November 26, 2024

టి ఆర్ ఎస్, ఎంఐఎంల‌కు అధినేత ఒక్క‌రేః కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – టీఆర్‌ఎస్‌, ఎంఐఎం అధినేతలు వేరు కాదని.. ఇద్దరు ఒకటేనని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి . న్యూఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఎంఐఎంకి సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు వంగి వంగి సలాం చేస్తారని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎంఐఎం కనుసన్నల్లో పోలీస్ అధికారుల నియామకాలు చేపట్టారన్నారు. జీహెచ్‌ఎంసీ అప్పులకుప్పగా మారిందని కిషన్‌రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ విస్మరించారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పొత్తుపై తాము చెప్పిందే నిజమైందనిపేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement