ఎన్డీయే కూటమికి 400 సీట్లు రావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బస్తీ పర్యటనలో భాగంగా నల్లకుంట డివిజన్, సత్యానగర్, రత్ననగర్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేటి ఉదయం పర్యటించారు. కాలనీల్లో కిషన్ రెడ్డిని అడుగడుగునా స్వాగతం పలికారు.
మహిళలు, కాలనీ పెద్దలు, పుర ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు, కిషన్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరి పలకరిస్తు ముందుకు సాగారు. అనంతరం వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సరదగా కాసేపు ముచ్చటించారు.
అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వెంకటగిరిలో పర్యటించారు. వేంకటగిరి చేరుకున్న కేంద్రమంత్రి ముందుగా స్థానిక పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం బస్తిలో స్థానికులతో కలిసి కలియతిరిగారు. అత్రియ 10 అపార్ట్మెంట్ సభ్యులతో ముచ్చటించారు. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీ సాయి కిరణ్ అపార్ట్మెంట్ లో కేంద్రమంత్రి పర్యటన కొనసాగుతుంది.
అపార్ట్మెంట్ వాసులు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అపార్ట్మెంట్ పెద్దలు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి నల్లకుంటలో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామన్నారు. తాను అంబర్ పేట్ బిడ్డను, సికింద్రాబాద్ ఎంపీ కాకముందు మూడు సార్లు అంబర్ పేట ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ఈసారి కూడా సికింద్రాబాద్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.