Friday, November 22, 2024

CBI – మేడిగ‌డ్డ ప్రాజెక్ట్ కుంగుబాటుపై సిబిఐ విచారణ చేయాల్సిందే …. కిష‌న్ రెడ్డి

మేడిగ‌డ్డ – పిల్లర్ల కుంగుబాటుతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్రెడ్డి. . ఇటీవల డ్యాం సేఫ్టీ అధికారుల బృందం 20 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరితే 11 మంది అంశాలకు సంబంధించిన వివరణ మాత్రమే ఇచ్చార‌ని ఆయ‌న పేర్కొన్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు నేప‌థ్యంలో నేడు కిష‌న్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, మంథని, భూపాలపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో క‌ల‌సి డ్యాం న ప‌రిశీలించారు.. దీనికోసం ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ లో కిష‌న్ బృందం అక్క‌డికి చేరుకుంది.. ప్రాజెక్ట్ ప‌రిశీల‌న అనంత‌రం కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, . డ్యాం నిర్మాణంలో చాలా లోపాలున్నాయ‌న్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు . రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో తెలంగాణ ప్రజల భవిష్యత్ అంధకారంలో పడిందని ఆరోపించారు .

ఇటీవల కుంగిన మేడిగడ్డ( లక్ష్మీ) బ్యారేజీను కేంద్ర కమిటీ పరిశీంచింది. CWC సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ డ్యా్మ్ ను పరిశీలించార‌ని అంటూ ఆ బృందం ఇచ్చిన నివేదిక వివ‌రాల‌ను వెల్ల‌డించారు. భూమి ప‌టిష్ట‌త టెస్ట్ లు స‌రిగా నిర్వ‌హించ‌క‌పోవ‌డం, నాణ్య‌త లేని సిమెంట్ వాడ‌టం వ‌ల్లే ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్ట్ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్ధంగా మారింద‌న్నారు.. అలాగే అన్నారం బ్యారేజీ కింద పియర్స్ నుంచి వాటర్ నాణ్యత లోపం వల్లే వృధాగాపోతోందన్నారు. ప్రాజెక్టులో ఒక్క టీఎంసీ నీరు కూడా నిల్వలేదన్నారు. వేలకోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రజలు, ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. ప్రాజెక్టు నిర్మాణం శాస్త్రీయబద్ధంగా లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇంజనీరుగా అవతారమెత్తి, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించడంతో ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ప్రాజెక్టు గుదిబండగా మారిందన్నారు.

రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల ఏ ఉపయోగం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి సీబీఐ దర్యాప్తుకు అంగీకరించాలన్నారు. లక్షల కోట్ల ప్రజాధనం గోదావరి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు 20 అంశాలపైన డాటా అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 11 అంశాలపైనే నివేదిక ఇచ్చిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. కాళేశ్వ‌రం అవినీతిపై విచార‌ణ‌కు కెసిఆర్ అంగీక‌రించాల‌ని డిమాండ్ చేశారు.. లేకుంటే తాము అధికారంలోకి రాగానే విచార‌ణ జ‌రిపి బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement