Wednesday, November 20, 2024

Kishan reddy Bio data – రెండో సారి కిష‌న్ రెడ్డికి మోదీ కేబినెట్ లో చోటు..

తెలంగాణ లోని. సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి రెండో సారి మోదీ కెబినెట్ లో చోటు ద‌క్కింది. ఇవాళ సాయంత్రం మోడీతో కలిసి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. గతంలోనూ ఇదే స్థానంలో గెలిచారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.

కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..

కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా. 1977లో జనతా పార్టీలో చేరారు. అంతకుముందు సంఘ్ కార్యకర్త. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.బీజేపీలో కీలక నేతగా ఎదిగిన కిషన్ రెడ్డి తొలిసారి హిమాయత్ నగర్ శాసనసభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్ నగరంలో సీటు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2009లో అంబర్ పేట నుంచి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

2014లో మరో అవకాశం వచ్చింది. 2014 ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. 2016 నుంచి 2018 వరకు అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇందులో గెలవడమే కాకుండా కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కింది. ఇటీవలి వరకు, అతను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

బ‌యోడేటా…

- Advertisement -

గంగాపురం కిష‌న్ రెడ్డి
జననం : 15 జూన్ 1964
స్వ‌గ్రామం : రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్
తండ్రి : జి.స్వామిరెడ్డి
త‌ల్లి : ఆండాలమ్మ
భార్య : కావ్యారెడ్డి
పిల్ల‌లు : ఒక కుమార్తె, ఒక కుమారుడు
ప‌ద‌వులు

  • 2004 నుంచి 2009 వరకు హిమాయత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు
  • 2009లో అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి పోటీ చేశారు.
  • 2014 వరకు అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, శాసనసభలో బిజెపి ఫ్లోర్ లీడర్‌గా
  • 2019లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.

సహాయ మంత్రి..

  • 2019 మే 30న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2021 వరకు సహాయ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

కేంద్ర‌మంత్రి..

  • గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో పర్యాటక శాఖ , సాంస్కృతిక శాఖా మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.
    ప్ర‌స్తుతం
    సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపు

పార్టీ ప‌ద‌వులు
1982 నుండి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ యువమోర్చా రాష్ట్ర కోశాధికారిగా ..
1983 నుండి 1984 వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, భారతీయ జనతా యువ మోర్చా, ఆంధ్రప్రదేశ్
1986 నుండి 1990 వరకు భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా.. .
1990 నుండి 1992 వరకు భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా మరియు దక్షిణ భారతదేశ ఇంచార్జిగా …
1992 నుండి 1994 వరకు భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా …
1994 నుంచి 2001 వరకు భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా…
2001 నుండి 2002 వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా …
2002 నుంచి 2004 వరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా …
2004 నుంచి 2005 వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీఎస్ గా, అధికార ప్రతినిధిగా …
ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా …

Advertisement

తాజా వార్తలు

Advertisement