హైదరాబాద్ : సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. నేటి మధ్యాహ్నం కిమ్స్ హాస్పటల్ కు వెళ్లిన ఆయన వైద్యులను శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.. అలాగే శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ను పలుకరించి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. శ్రీతేజ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు చెప్పారన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆ భవగవంతుడిని ప్రార్థిస్తునట్లు చెప్పారు… సినిమా వాళ్లను భయపెట్టి సీఎం రేవంత్ మంచి చేసుకోకూడదని హితవు పలికారు.. ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. . గురుకులాల్లో మృతి చెందిన పిల్లల కుటుంబ సభ్యులను ఇంత వరకు ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. ఓ సర్పంచ్ ఆత్మహత్యకు కారకుడైన మీ సోదరుడిని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలన్నారు.. శ్రీతేజ్‌ను పరామర్శించిన వారిలో కేపీ వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, నవీన్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.