Sunday, November 24, 2024

Khamnam జిల్లాలో మళ్ళీ కుంభవృష్టి – సహాయ కార్యక్రమాలలో మంత్రి తుమ్మల

ఖమ్మం – నేటి మధ్యాహ్నం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన వర్షం భారీ ఎత్తున కురుస్తుండతో ఆందోళన మొదలైంది.

ఎగువన కూడా బయ్యారం, గార్ల, మహబూబాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మున్నేరుకి వరద వస్తుంది. దీంతో.. మున్నేరు ముంపు బాధితులను మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి ఈ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తుంది. దీంతో మళ్లీ మున్నేరు ఉధృతి పెరుగుతుందా అనే ఆందోళన కొనసాగుతుంది. ఈ క్రమంలో.. మళ్ళీ వరద వస్తుందని ఆందోళనతో పునరావాస కేంద్రాలకి తరలించాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాలు జారీ చేశారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరు మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకదాటిగా కురిసిన కుండపోత వర్షానికి వీ.ఎం.బంజర్ రింగ్ సర్కిల్ వద్ద విజయవాడ టూ చతీస్త్ఘడ్ నేషనల్ హైవే పైకి భారీగా వరద పోటెత్తింది. నేషనల్ హైవే పైకి మోకాళ్ళ లోతు వరద రావటంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వీ.ఎం.బంజర్ లోని పలు ఇళ్ళలోకి నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల రహదారులపై మోకాళ్ళ లోతు వరద ప్రవహిస్తుంది. దీనికి తోడు ఈదురు గాలులు బలంగా వీస్తుండటంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement