భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీకి జెడ్పీటీసీ కొనకండ్ల వెంకటరెడ్డి రాజీనామా చేశారు. త్వరలో ఏ పార్టీలోకి చేరేది తెలియజేస్తానని విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో, జిల్లాలో పక్క పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరి ఎంతోకాలంగా కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న వారికి అన్యాయం చేస్తున్నారని, దానిని సహించలేకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.