చింతకాని: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తే భవిష్యత్ తరాలు బాగుపడతాయని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. చింతకానిలోని ఐకేపీ కార్యాలయంలో విజయభారతి మహిళా మండలి, ఎస్బీఐ -గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యాన మహిళలకు మగ్గం వర్క్ శిక్షణ ఇస్తున్నారు.
ఈ శిబిరాన్ని శనివారం పరిశీలించిన చంద్రశేఖర్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎస్బీఐ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యాన శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. కోర్సు కోఆర్డినేటర్ మగ్గం వర్క్ శిక్షణను డైరెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ వహీద్, విజయభారతి మహిళా మండలి అధ్యక్షురాలు ధర్మపురి విజయలక్ష్మితో పాటు నరేశ్, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -