భద్రాచలం – పినపాక శాసనసభ్యుడు, విప్ రేగా కాంతారావు మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు…అత్యవసర వైద్య కోసం వెళుతున్న ఇద్దరు మహిళలకు ఆయన నేడు సాయం చేసి వారిని కాపాడారు.. వివరాలలోకి వెళితే భద్రాచలం బ్రిడ్జి వద్ద భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది.. ఆ ట్రాఫిక్ లో నిండుగర్భిణి చిక్కుకుపోయింది.. అది గమనించిన రేగా వెంటనే తన కాన్వాయ్ లోకి ఆమెను తరలించి పాల్వంచ హాస్పటల్లో చేర్చారు…మరో సంఘటన పైడిగూడెంలో జరిగింది.. ఇక్కడి గిరిజనులు పోడు భూములపై ఆందోళన చేస్తున్నారు.. ఈ ఆందోళనలో పాల్గొన్న ఆకస్మికంగా సోమసిల్లిపడిపోయింది.. ఆ సమయంలో ఆక్కడికి చేరకున్న రేగ స్వయంగా ఆమెకు సపర్యలు చేశారు… అనంతరం ఆమెకు జావ అందజేశారు..కోలుకున్న ఆమె రేగాకు కృతజ్ఞతలు తెలిపింది.. ఈ సమయంలో భద్రాచలం టిఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి తెల్లం వెంకటరావు తదితరులున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement