పోడు భూముల సమస్య పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అనుసరించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. అందులో పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టాలన్నాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. కలెక్టరేట్లో పోడు భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ.. జిల్లాలో అటవి సంపదను సంరక్షించుకోవడంతో పాటు అర్హులైన పోడు సాగుదారులకు హక్కు కల్పించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, జెడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు జిల్లా ఫారెస్ట్ అధికారి రంజిత్ నాయక్ పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement