ఖమ్మం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. కార్పొరేషన్‌లోని ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో కార్పొరేషన్‌లో ఆ పార్టీ ఇప్పటివరకు 7 స్థానాలను సొంతం చేసుకున్నది. ఇప్పటికే 10వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. కార్పొరేషన్‌లోని 13వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్తపల్లి నీరజ గెలుపొందారు. అలాగే కాంగ్రెస్ 3, బిజెపి 1, సిపిఐ 2,సిపిఎం ఒక డివిజన్ లలో గెలుపొందారు.. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. పట్టణంలోని ఎస్సార్ బీజీఎన్నార్ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. 10 కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు. ఒక్కో లెక్కింపు హాల్‌లో 6 డివిజన్ల ఓట్ల లెక్కింపు. మొత్తం 251 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
7వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి విజయం
13 డివిజన్లోనూ టీఆర్ఎస్ విజయకేతనం.
25 డివిజన్లోనూ టీఆర్ఎస్ గెలుపు.
31వ డివిజన్‌లో సీపీఎమ్ అభ్యర్థి విజయం.
37 డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం.
49వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు.
55వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
43వ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థి గెలుపొందారు.
19వ డివిజన్లోనూ సీపీఐ అభ్యర్థి ,. 14 వ డివిజన్ లో టిఆర్ఎస్ వలరాజు,, 2వ వార్డు మలీదు వెంకటేశ్వర్లు (కాంగ్రెస్) ,. 56 వ డివిజన్ టిఆర్ఎస్ పైడిపల్లి రోహిణి విజయం సాధించారు.