Thursday, November 21, 2024

ఖ‌మ్మం కార్పొరేష‌న్ – 12 డివిజ‌న్ ల‌లో టి ఆర్ ఎస్ విజ‌యం…

ఖమ్మం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతున్నది. కార్పొరేషన్‌లోని 12 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో కార్పొరేషన్‌లో ఆ పార్టీ ఇప్పటివరకు 13 స్థానాలను సొంతం చేసుకున్నది. ఇప్ప‌టి వ‌ర‌కు 20 డివిజ‌న్ ల‌లో ఓట్ల లెక్కింపు పూర్తి అయింది.. కాగా, 10వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. అలాగే కాంగ్రెస్ 3, బిజెపి 1, సిపిఐ 2,సిపిఎం ఒక డివిజన్ లలో గెలుపొందారు.. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లకు ఏప్రిల్‌ 30న ఎన్నికలు జరిగాయి. పట్టణంలోని ఎస్సార్‌ బీజీఎన్నార్‌ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. 10 కౌంటింగ్‌ హాళ్లలో ఓట్ల లెక్కింపు. ఒక్కో లెక్కింపు హాల్‌లో 6 డివిజన్ల ఓట్ల లెక్కింపు. మొత్తం 251 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

విజేత‌ల వివ‌రాలు డివిజ‌న్ ల వారిగా..
1:తేజావత్ హుస్సేన్(టిఅర్ఎస్)
2:మలీదు వెంకటేశ్వర్లు(కాంగ్రెస్)
7: దొంగల సత్యనారాయణ(బిజెపి)
8: లకావత్ సైదులు(కాంగ్రెస్)
13:కొత్తపల్లి నిరజటి(అర్ఎస్)
14:కురాకుల వలరాజు (టిఆర్ఎస్)
19:చామకూర వెంకన్న(సీపీఐ)
20: బిక్కసాని ప్రశాంత లక్ష్మి ( టిఆర్ఎస్)
25: గొల్ల చంద్రకళటి(ఆర్ఎస్)
26: పునుకొల్లు నీరజ (టి ఆర్ ఎస్ )
31:యర్రా గోపి (సిపిఎం)
32: డోనవాత్ సరస్వతి ( టిఆర్ఎస్)
37:ఎస్ కె ఫాతిమా(టిఆర్ఎస్)
38: ఆలియా(టిఆర్ఎస్)
43: క్లైమేట్( సి.పి.ఐ)
44: పాలేపు విజయ( టిఆర్ఎస్)
49: దుద్దుకూరి వెంకటేశ్వర్లు(కాంగ్రెస్)
50: రాపర్తి శరత్ (టిఆర్ యస్)
55: మోతారపు శ్రావణి(కాంగ్రెస్)
56: పైడిపల్లి రోహిణి(తెరాస)
పొత్తుల వారిగా
టిఆర్ఎస్ + సీపీఐ=14
కాంగ్రెస్+ సీపీఎం =5
బీజేపీ = 1

Advertisement

తాజా వార్తలు

Advertisement