తెలంగాణ రాష్ట్రం అంటే సంక్షేమ, అభివృద్ధి కార్యాక్రమాలకు గుమ్మం వంటిదని, తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని, పేద నిరుపేదల అవసరాలు, ఆవశ్యకతను ముందుగానే ఆలోచన చేసి వారి అవసరాలకనుగుణంగా ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలను రూపొందించి అన్ని సామాజిక వర్గాలకు సీఎం కేసీఆర్ ఆర్ధిక చేయూత నందిస్తున్నారని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మధిర నియోజకవర్గంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజుతో కలిసి చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయం రూ.1 లక్ష చెక్కులను 100 మంది లబ్ధిదారులకు కలెక్టర్ పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ.. సీఎం కె.చంధ్రశేఖర్‌రావు ఎవ్వరూ ఊహించని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి వాటిని విజయవంతంగా అమలు చేయడం జరుగుతందన్నారు.