Sunday, November 24, 2024

TG | నిజాల‌వెలికితీత‌లో జర్నలిస్టుల పాత్ర కీలకం : మంత్రి పొంగులేటి

పాల్వంచ : నిజానిజాలను వెలికితీయడంలో పాత్రికేయులదే కీలకపాత్ర అని తెలంగాణ దేవాదాయ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జెన్ కో కేటాయించిన స్థలంలో శ్యామల గోపాలన్ ఫౌండేషన్ చైర్మన్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్‌ను స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తల రాసిన జర్నలిస్టులపై కేసులు పెట్టిన చరిత్ర ఉందని, తమ ప్రభుత్వంలో విలేకరులు స్వేచ్ఛగా వార్తలు రాసుకునే వీలుందన్నారు. ఆ ట్యూబులు ఈ ట్యూబులు పేరిట తమ ప్రభుత్వంపై బురద చల్లేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

తప్పులు ప్రభుత్వం చేసిన ప్రతిపక్షం చేసిన విలేకరులు ధైర్యంగా వార్తలు రాసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైయస్ హయాంలో హైదరాబాదులో 72 ఎకరాల భూమిలో 1050 మంది విలేకరులకు ఇంటి పట్టాలు ఇచ్చిరాని… గత ప్రభుత్వంలో కోర్టులో విలేకరులకు స్థలాలు ఇచ్చే విధంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు.

తమ ప్రభుత్వంలో త్వరలోనే జవహర్ సొసైటీకి ఈ స్థలాలను భారీ బహిరంగ సభ నిర్వహించి వారి సమక్షంలో అందజేస్తామన్నారు. కొన్ని పింక్ పేపర్లు తమపై వ్యతిరేకంగా వార్తలు రాసిన పట్టించుకోమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మాటలు చెప్పిందని తమ ప్రభుత్వం చేతల ద్వారా చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కే టి పి ఎస్ ట్రైనింగ్ సెంటర్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస బాబు, మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, ఏపీఆర్ఓ అస్గర్ హుస్సేన్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ప్రెస్ క్లబ్ నిర్మాణదాత నల్ల సురేష్ రెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి షేక్ సుభాని, గౌరవాధ్యక్షులు సంజీవ్ కుమార్, సలహాదారులు చండ్ర నరసింహారావు, కోశాధికారి రజాక్, ఉపాధ్యక్షులు వెంకటనారాయణ, ఏ. అబ్బురామ్, ఆర్ కృష్ణమూర్తి, జైనుల్లాబద్దీన్, జగదీష్, వాజిద్, వై. శ్రీనివాసరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీయూడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్, ఉదయ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర కామేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, దేవి ప్రసన్న, నాగా సీతారాములు, సిపిఎం, సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు దొడ్డా రవికుమార్, సాయిబాబు, వీసంశెట్టి పూర్ణ, మాస్ లైన్ నాయకులు నిమ్మల రాంబాబు, ఐ ఎన్ టీ యు సి రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఏ జలీల్, 15 35 జాతీయ అధ్యక్షులు ఎంఏ వజీర్, టిఆర్వికేఎస్ రాష్ట్ర కార్యదర్శి చారుగుండ్ల రమేష్, 327 రాష్ట్ర కార్యదర్శి ఎంఏ మజీద్, 1104 రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్, కోటే శ్వరరావు, సిఐటియు రాష్ట్ర నా యకులు అంకిరెడ్డి నరసిం హారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలతో సత్కరించి, మెమొంటోలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement