Tuesday, November 26, 2024

దళిత బంధు అమలు చారిత్రాత్మక నిర్ణయం : మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌

దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలుకు సంకల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం పూర్తి స్థాయిలో దళిత బంధు పథకం అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా నాగులవంచ, కోదుమూరు గ్రామంలో ఎస్సీ లబ్దిదారులకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన JCBలు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, ట్రాలీ జీప్ లు తదితర యూనిట్స్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణి చేశారు. తొలుత గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించారు. ఆనంతరం దళిత బంధు పథకం క్రింద మంజూరైన యూనిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హర్వెస్టర్ ను ఎక్కి నడిపారు. వాటిని పొందడం పట్ల ఆయా రైతులతో కసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాల్లో చింతకాని మండలంకు పూర్తి స్థాయిలో అమలు చేయడం చారిత్రాత్మకం అన్నారు. రూ.400కోట్ల ప్రభుత్వం నిధులతో దళితుల ఆర్థిక పురోగతిని కాంక్షించినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రయోగాత్మంగా ముందుగా నియోజకవర్గంకు 100 చొప్పున దళిత బందు అమలు చేశామని, రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుందని, ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి పువ్వాడ భరోసా కల్పించారు. నిన్న నుండి రైతు బంధు నుండి ప్రతి రైతుల ఖాతాల్లో నగదు పడుతుందన్నారు. రైతుబందు పథకం ప్రారంభించినప్పుడు కూడా ప్రతిపక్షాలు అపహాస్తం చేశారని కానీ నేటి వరకు ప్రతి రైతుకు క్రమం తప్పకుండా నగదును వేస్తున్నారని వివరించారు. నేటి వరకు రైతు బంధు పథకం ద్వారా మొత్తం దాదాపు 57వేల 540 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement