Monday, November 25, 2024

లైంగిక వేధింపులపై విద్యార్థుల నృత్యరూపకం

ఖమ్మం, ఆంధ్రప్రభ: మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న లైంగిక వేధింపులు, అఘాయిత్యాలపై అవగాహన కల్పించేలా ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకం ఆకట్టుకుంది. చదువుతో పాటు సామాజిక చైతన్యం నింపడం కూడా తమ బాధ్యత అన్న చందంగా విద్యార్థులు ఈ సామాజికాంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని విద్యార్థినులు నాట్యరూపకాన్ని జలగంనగర్‌లోని రూరల్ మండల మహిళా సమాఖ్య సమావేశంలో ప్రదర్శించారు.

మహిళల్లో చైతన్యాన్ని పెంపొందించడానికి హృద్యంగా ప్రదర్శించిన ఈ కళారూపం వీక్షకులను కంటతడి పెట్టించింది. ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు, పూర్వ విద్యార్థి సంఘ సమన్వయకర్తలు పోట్ల కృష్ణవేణి, ఎన్. పద్మావతి, ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లుతో పాటు అనేకమంది మహిళలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement