Tuesday, November 26, 2024

రామయ్య కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం..

భద్రాచలం : రామయ్య కల్యాణానికి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అధికారికంగా పనులు మొదలయ్యాయి. హోలీ, పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలోని చిత్రకూటమండపంలో కరోనా నిబంధనలు పాటిస్తూ సీతారాముల కల్యాణానికి మహిళలు, అర్చకులు తలంబ్రాలు సిద్ధం చేశారు. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 13వ తేదీ నుంచి జరగనున్నాయి. ఏప్రిల్ 21న సీతారాముల కల్యాణం, 22న రామయ్య పట్టాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. అయితే సీతారాముల కల్యాణంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న తలంభ్రాలు కలిపే ఘట్టం ముగిసింది. సీతారాములకు ప్రత్యేక పూజల అనంతరం పసుపు కొమ్ములు దంచే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పసుపు కొమ్ములు దంచే కార్యక్రమం నిర్వహించే వైదిక బృందం పసుపు కొమ్ములు దంచి పసుపును తయారు చేసింది.



Advertisement

తాజా వార్తలు

Advertisement