ఖమ్మం మాజీ ఎంపీ, త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవ్వాల (సోమవారం) ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి ఓ జ్ఞాపికను అందజేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత తో భేటీ సందర్భంగా నాలుగు వరుసలుగా ఉన్న గోవుల సమూహంతో కూడిన డిజైన్‌ని అందించి ఆసక్తికరమైన చర్చకు తెర లేపారు. నాలుగు వరుసలుగా 19గోవుల ఆకృతితో కూడిన సమూహాన్ని పరిశీలించిన రాహుల్ గాంధీ ఆ డిజైన్ ప్రాధాన్యం ఏంటో తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరిచారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ దేశానికి శక్తివంతమైన గోమాతతో సమానమైందని, దేశ ప్రజలకు వరాలను అందించే గోమాత కాంగ్రెస్ పార్టీ అని, నాలుగు తరాలుగా నాలుగు వరుసల గోమాతలను చూపుతూ.. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నాలుగవ తరం కింద గోమాతల సమూహంగా , దేశ ఐక్యతను, సమగ్రతను మూడు రంగుల జెండా ప్రాధాన్యతలను ఆ చిత్రంలో ప్రస్తావించడం విశేషం. టి పి సి సి రేవంత్ రెడ్డి ద్వారా గో సమూహ ప్రాధాన్యం తెలుసుకున్న రాహుల్ గాంధీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రత్యేకంగా బహుత్ అచ్చా హై అంటూ అభినందించినట్టు సమాచారం.