Tuesday, November 26, 2024

ఖమ్మంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు.. ఫలించిన మంత్రి పువ్వాడ కృషి

ఖమ్మం: ఖమ్మం నగరం శ్రీనివాస నగర్ నందు నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రాలు (STP) ఖమ్మం నగరంకు ఇతర అవసరాల నీటి వనరుగా నిలువనుంది. ఇప్పటి వరకు ఖమ్మం నగరంలో ఉన్న తాగునీటి సమస్యను మిషన్ భగీరథ ద్వారా అధిగమించి తాగు నీరు అవసరాలు తీర్చేందుకు కృషి చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాగు మినహా ఇతర అవసరాల కోసం ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో వెలువడుతున్న మరుగును శుద్ధి చేసి ఇతర అవసరాల కోసం నీరును సమకూర్చేందుకు మరో అడుగు ముందుకేశారు. ఖమ్మం నగరం శ్రీనివాస నగర్ నందు రూ.30కోట్లతో 20 మిలియన్ లీటర్ పర్ డే(MLD) సామర్ధ్యం గల (STP) నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ శంకుస్థాపన చేశారు. ఆయా ప్లాంట్ నిర్మాణం అనంతరం ఖమ్మం నగరం నుండి వెలువడే మురుగు నీటిని నిత్యం 20 ఎంఎల్‌డీల మురుగు జలాలను శుద్ది చేసి నిల్వ ఉంచుతారు. ఇలా శుద్ధయిన నీటిని ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో ఉన్న పార్కులు, గార్డెనింగ్‌లు, నర్సరీలు, టాయిలెట్ల నిర్వహణకు వినియోగించనున్నారు. ప్రతి రోజు ఖమ్మం నగరంలో గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి విడుదలయ్యే మురుగును శుద్ధి చేయడం ద్వారా పర్యావరణంకు ఏలాంటి నష్టం కలుగకపోగా భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉంటాయి. తాగడానికి మినహా ఇతర అన్ని అవసరాలకు వినియోగించాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. వేసవి కాలంలో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో శుద్ది చేసిన నీరు తరలించేందుకు ఎస్టీపీల వద్ద ప్రత్యేకంగా ఫిల్లింగ్‌ స్టేషన్లను ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని తరలించి వినియోగించా లన్నారు. ఇలాంటి ప్రోజెక్ట్ ఖమ్మం లో ఎర్పాటు చేయడానికి సహకరించిన పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement