Monday, November 18, 2024

మొక్క‌ల సంరక్ష‌ణ మ‌నంద‌రి బాధ్య‌త : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మొక్క‌ల సంర‌క్ష‌ణ మ‌నంద‌రి బాధ్య‌త‌ని, ప్ర‌తి ఒక్క‌రు మొక్క‌లు నాటి సంర‌క్షించాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసన సభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేటలో మొక్కల నర్సరీని ప్ర‌భుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ బుధ‌వారం సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీ నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. మొక్క‌ల సంక్ష‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. మొక్క‌లే మాన‌వాళికి జీవ‌నాధార‌మ‌న్నారు. తెలంగాణ‌లో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం ద్వారా కోట్లాది మొక్క‌ల‌ను నాట‌డం జ‌రుగుతుంద‌ని, భ‌విష్య‌త్ త‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement