ఖమ్మం నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో రిపబ్లిక్ డే సందర్భంగా డైరెక్టర్ రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్ పో ఏర్పాటు చేశారు. చిన్నారులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆలోచింపజేసేదిగా ఉంది. కనుమరుగవుతున్న భారతీయ సాంప్రదాయ వస్తువులను చిన్నారులు సేకరించి ప్రదర్శించారు. మనుగడలో లేని నాణేలు, గతంలో వాడిన వస్తువులు ప్రదర్శనలో ఉంచారు.
పల్లెటూరులో గడ్డితో కట్టుకున్న ఇళ్లు ఎలా ఉంటాయో ఆ విధంగా ఇళ్లను విద్యార్థులు రూపొందించారు. ఇప్పటి పిల్లలు చూడని ల్యాండ్ లైన్ ఫోన్ లు, టేప్ రికార్డ్ లు లాంటివి కూడా ప్రదర్శించారు. అంతరించిపోతున్న పండుగల ప్రాముఖ్యతను విద్యార్థులు వివరించారు. విద్యార్థులు దాదాపు తెలుగును మర్చిపోతున్న రోజుల్లో తెలుగు సామెతలు విద్యార్థులు ప్రదర్శించారు. ఈసందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ ప్రదర్శనను సందర్శించి, చిన్నారుల ప్రతిభను మెచ్చుకున్నారు.