Tuesday, November 19, 2024

ముంపు బాధితులకు అండగా ఉంటా.. రెగా కాంతారావు

మణుగూరు, (ప్రభ న్యూస్): కోద్ది రోజులు నుండి కురుస్తున్న వర్షాలకు మణుగూరు జన జీవనం స్తంభించింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మణుగూరు పట్టణంలో పలు ప్రాంతాలు జలమయ్యాయి. ఒక్క పక్క వర్షాలకు ఇళ్ళు అన్ని జలమయం అవడంతో ప్రజల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మీకు నేను ఉన్నానంటూ,ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు భారి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా, అధికారులకు దిశ నిర్దేశం చేస్తూ రంగంలోకి అయనే స్వయంగా దిగారు. మణుగూరు లోతట్టు ప్రాంతంలో బుధవారం పర్యటించారు.

జలమయమైనా ప్రాంతాల ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రజా ప్రతినిధి అంటే సేవకుడుని అనే నినాదానికి అయన అర్దం పలికారు. వర్షం ఒక్క పక్క జోరున పడుతున్న, లెక్క చేయకుండా ప్రజలే ముఖ్యం అని సహాయక చర్యలు చేపట్టారు. వర్షం దాటికి జలమయం అయన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముంపు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి,అక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

పునరావాస కేంద్రంలో ప్రజలకు ఎలాంటి అ సౌకర్యం కలగవద్దని అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు గురించి,ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎవరూ అ దైర్య పడవద్దని మీకు నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు భయటికి రావద్ద అని సూచించారు. భారి వర్షాలకు గోదావరి పోంగి ఉధృతి ప్రవహిస్తుందని, ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని తెలిపారు.ఏలాంటి పరిస్థితుల్లో అయన అందుబాటులో ఉంటానని ప్రజలకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement