Saturday, November 23, 2024

పిఆర్సీ ప్ర‌క‌ట‌న‌పై మంత్రి పువ్వాడ హ‌ర్షం….కెసిఆర్ కి కృత‌జ్ఞ‌త‌లు

హైద‌రాబాద్/ఖ‌మ్మం – తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయుల‌కు 30శాతం ఫిట్ మెంట్ ఇచ్చి, 61 ఏండ్ల‌కు ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌సుని పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో ప్రకటించడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పిఆర్సీ విష‌యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, తెలంగాణ ప్రభుత్వంకు ఉద్యోగులకు ఉన్న పేగు బంధం ఎవ్వరు చేరిపివేయలేరని అన్నారు. 61 ఏండ్లకు ఉద్యోగ విరమణ పెంపు పట్ల నేడు ఉద్యోగుల స‌మాజం మొత్తం సంతోషంగా ఉంద‌న్నారు. వారు ఊహించిన దానికంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఇచ్చార‌ని తెలిపారు. ఉద్యోగ స‌మాజం మొత్తం సిఎం కి కృత‌జ్ఞ‌త‌గా వారికి రుణ‌ప‌డి ఉంటుంద‌న్నారు. సీఎం కెసిఆర్ త‌న ధాతృత్వాన్ని చాటుకున్నార‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్న ఉద్యోగులంద‌రిని ఎన్న‌డూ మ‌ర‌చిపోని రీతిలో పిఆర్సీ ఇచ్చార‌ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉద్యోగుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement