ఖమ్మం – కల్చరల్ -:లౌకికవాదం , మతసామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖమ్మం నియోజకవర్గ కేంద్రం సీక్వెల్ ఫంక్షన్ హాల్ లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన దావత్-ఏ-ఇఫ్తార్ విందు లో హోం మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూవిభిన్న మతాలు, భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే అత్యంత అద్భుతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారుతెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడా లేవన్నారు.గురుకుల పాఠశాలలు, రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతోపాటు సాగు, తాగునీరు ఇస్తూ పెట్టుబడి సాయంగా రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.సియం కేసీఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రి గా చేసుకునే బాధ్యత మన పై ఉందని, ఖమ్మం లో పువ్వాడ అజయ్ కుమార్ ను వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు