పినపాక – తాను ఉగ్రవాదిని కానని,తనకు సెక్యూరిటీ అవసరం లేదని మాజీ ఎం.పీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి పినపాక నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగిరెద్దుల అడించే వారిలా సంక్రాంతి కి రాలేదని అన్నారు. తనకు సెక్యూరిటీ అవసరం లేదని, లక్షలాది మంది అభిమానులు ఉన్నారని తెలిపారు. తనకు ఈ సెక్యూరిటీ అవసరం లేదని స్పష్టం చేశారు. తను ఉగ్రవాదినీ కాదని, కబ్జా లు ఎక్కడ చేయలేదని సంపాదించుకున్న దానిని ఖర్చు పెడుతున్నానని పొంగిలేటి అన్నారు. తనకు రాజకీయంగా గాడ్ ఫాదర్ ఎవ్వరూలేరన్నారు. గాడ్ ఫాదర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement