Saturday, November 23, 2024

ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కోస‌మే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం- టౌన్ ఏసీపీ

స్ధానిక ప్రజలకు ఎలాంటి అభద్రత భావం లేకుండా మేమున్నామని భరోసా కల్పించడం కోసమే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ అంజనేయులు తెలిపారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
వై ఎస్ ఆర్ నగర్ లో స్ధానిక పోలీసుల ఆద్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు గుర్తింపు కార్డులను పరిశీలించారు. సరియైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు , ఒక కారు, 14 ఆటోలను గుర్తించారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా టౌన్ ఏసీపీ మాట్లాడుతూ… నేరరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు ఆసాంఘిక కార్యాకాలపాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, అయా ప్రాంతాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని తెలిపారు. స్దానికంగా ఏలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణం వుండాలని సూచించారు. ముఖ్యంగా యువత అనవసరమైన గొడవలకు పోతే మీ భవిష్యత్త్ ప్రశ్నార్ధకం ఆవుతుందని గుర్తించాలని సూచించారు.ఎలాంటి అత్యవసర సమయములో అయిన డయల్ 100 కు లేదా స్దానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిచాలని సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడపవద్దని నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనాలని డాక్యుమెంట్స్ లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలకు సంబంధించిన పత్రాలు చూపించిన తర్వాత తిరిగి వారి వాహనాలను వారికే అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పోలిస్ వారికి పూర్తిగా సహకారాన్ని అందించారని తెలిపారు. నాలుగురు ఇన్స్‌పెక్టర్లు, 12 మంది ఎస్సైలు, 14 ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుల్ , 20 కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు రామకృష్ణ, చిట్టిబాబు, సర్వయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement