Friday, November 22, 2024

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలు కంట్రోల్​ సెంటర్​ని హెల్ప్​ కోరొచ్చు: పువ్వాడ అజయ్​

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ఖమ్మం జిల్లా పరిధిలోని కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేశించారు. సోమవారం జిల్లాల క‌లెక్టర్లు, ఇత‌ర శాఖ‌ల‌ అధికారులతో మంత్రి టెలిఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, గోదావరి నది ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. జన జీవనానికి ఆటంకాలు తలెత్తకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

క్షేత్రస్థాయి అధికారులు లోకల్​గా అందుబాటులో ఉండి పర్యవేక్షించాలని మంత్రి పువ్వాడ అన్నారు. ప్రజల అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని, అత్యవసర సేవలకు కలెక్టరేట్‌లో, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 08744-241950, 08743-232444కు కాల్‌ చేసి సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement