Friday, November 22, 2024

ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ని ప్రారంభించిన మంత్రి..

ఖమ్మం : రూ.90 లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ ఉత్పత్తి(Oxygen Generated Plant) సెంటర్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మన గాలి, మన ఆక్సిజన్ అనే నినాదంతో ఈ సెంటర్ ని నిర్మించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మంత్రి సూచనల మేరకు ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేయగా దానికి హైదరాబాద్ నుంచి ఆక్సిజన్ రావాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఆయా ఆక్సిజన్‌ను ఖమ్మలోనే ఉత్పత్తి చేసుకునేందుకు ఆక్సిజన్ జనరేటెడ్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 125 సిలిండర్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుతో ప్రభుత్వ దవాఖానలో దాదాపు ఆక్సిజన్ సమస్య తీరింది. ఇక అన్ని సందర్భాల్లో రోగులకు నిత్యం ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని మంత్రి పువ్వాడ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement