మే 31, ఖమ్మం: పొగాకు వద్దు.. ఆరోగ్యమే ముద్దంటూ ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ సభ్యులు శుక్రవారం స్థానిక ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నందు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క ద్వారా తయారీ వల్ల పొగ విడుదల అవుతున్నందువల్ల దీనికి పొగాకు అనే పేరు వచ్చింది.
దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారు చేస్తారని, దీన్ని కొన్ని తరాలు తాంబులాల్లో కూడా ఉపయోగిస్తున్నారని క్రీస్తు పూర్వం 1400 ఏళ్ల నాడే పూర్వీకులు ఎంతగానో అభిమానించే వారని, కానీ అది మనుషుల ప్రాణాలతో చెలగాటం అడుతుందని గ్రహించలేదని, ఇప్పుడు ఆ పొగాకు ప్రాణాంతకంగా తయారైందని పౌరసమాజం పొగాకును వ్యతిరేకిస్తుందని తెలియజేస్తూ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నందు 8 అడుగుల బాహుబలి సిగరెట్ ను తయారుచేసి పొగాకు ద్వారా ఉత్పత్తియ్యే పదార్ధాలను వ్యతిరేకస్తున్నామని తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో వాకర్స్ సభ్యులు, క్రీడాకారులు, యూత్ కలసి సిగరెట్ బొమ్మపై సంతకాలు చేసి పొగాకును వ్యతిరేకిస్తున్నట్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఇకనుండి మేము మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఎవరేమి కానీ పొగాకు పదార్ధాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు. ప్రమాణం చేయడం కాకుండా పొగాకు మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి ప్రాణాలు కోల్పోతున్నారని, సగటున దేశంలో కరోనా లాంటి మహమ్మారి వల్ల మరణించింది.. తక్కువే కానీ పొగాకు వల్ల అనేక రోగాలు ఎదుర్కొంటూ సుమారు 10లక్షల మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ప్రభుత్వాలు వెంటనే పొగాకు ఉత్పత్తులు నిషేధించాలని పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాకం శ్యామ్ బాబు, సెక్రటరీ కొండమీది వెంకట్, సభ్యులు శొంఠి వెంకట్, కార్మిక నేత మందా వెంకటేశ్వర్లు, తాల్లూరి వేణు, వెంకట్ బాబు, విజయకుమార్, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, శ్రీనివాస్, లక్ష్మణ్ రావు, మల్లిఖార్జున్, అమీర్ అలీలు పాల్గొన్నారు.