Tuesday, November 26, 2024

KHM: న‌వ‌మి వేడుక‌ల్లో ముస్లీంలు… భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు పంపిణీ

ఖమ్మం : ఇందిరానగర్ పర్ణశాల ఆలయ ప్రాంగణంలో శ్రీ నామనవమి సందర్భంగా ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో రామ‌ భక్తులకు పానకం, మజ్జిగ, పులిహార, తదితర ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఫోర్త్ టౌన్ మైనార్టీ అధ్యక్షుడు యాకూబ్ పాషా మాట్లాడుతూ… భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం హిందూ, ముస్లిం భాయి భాయి అనే నినాదంతో వారు ఇంద్రానగర్ సీతారామ ఆలయం పర్ణశాల ప్రాంగణంలో సూచించారు.

దేశంలో జరుగుతున్నటువంటి మత రాజకీయాలకు కనువిప్పుగా జరిగే విధంగా వారు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకు మతాలకు, కులాలకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా పాలన చేయాలని ప్రధానమంత్రి మోడీని వారు కోరారు. దయచేసి మీ కంటే ముందు 14మంది ప్రధాన మంత్రులుగా పనిచేశారు.. ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా ఈ విధంగా ముస్లిం, దళితులపై దాడులు జరపలేదు.. కానీ మీ పాలనలో జరిగాయి.. ఇకనైనా మీరు మీ ప్రవర్తన మార్చుకొని సత్ప్రవర్తనగా మెలుగుతారని తాము ఆశిస్తున్నామ‌న్నారు. ప్రత్యేకంగా ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలంద‌రికీ కూడా వారు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో యం.డి. నవిద్ అసహర్, మహమ్మద్ సాబీర్, మహమ్మద్ సమీర్, షేక్ రియాజ్, యం.డి. బాబా, ముజామిల్, ఎస్.కె.ఇస్మాయిల్, ఎస్.కె. ఇమ్రాన్, కాలిద్, యాసిన్, కాంగ్రెస్ పార్టీ 9వ డివిజన్ ప్రెసిడెంట్ దొడ్డ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ యూత్ సంఘం లీడర్ రావులపాటి నిఖిల్, కాంగ్రెస్ యూత్ లీడర్ గుర్రం రాకేష్, కుమ్మరి కుంట్ల విక్రం, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నానబాల.రామకృష్ణ, పదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్ షకీల్ పాషా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement