Tuesday, November 26, 2024

ఔట్లేట్ పైప్ లో పడిన మున్సిపల్ కార్మికుడు ..సహాయక చర్యలు చేపట్టాలన్న మంత్రి పువ్వాడ

ఖమ్మం మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికుడు చిర్రా సందీప్ వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తున్న క్రమంలో చూసుకోకుండా ఔట్లేట్ పైప్ లో పడిపోయాడు. ఖమ్మం నయబజార్ నందు గల మెయిన్ వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తూ… ప్రమాదవశాత్తు ఔట్ లెట్ పైప్ లో పడి ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహాయక చర్యలకై సంభందిత అధికారులను అదేశించారు. మంత్రి వ్యక్తిగత పీఏ సీహెచ్.రవికిరణ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ లను ఘటనా స్థలానికి వెళ్ళి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్, ఫైర్, డీఆర్ఎఫ్ టీమ్ లను అప్రమత్తం చేసి సహాయక చర్యలు ప్రారంభించారు. సహాయక సిబ్బంది సందీప్ ను బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement