ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ సక్సెస్ చేయడం, ఏర్పాట్ల పర్యవేక్షణకు వారం రోజుల ముందు నుంచే మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పార్టీ నాయకత్వం ఖమ్మం చేరుకుంది. వీరితో పాటు జన సమీకరణ కోసం వివిధ నియోజకవర్గాలకు బాధ్యులుగా నియమితులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఖమ్మం కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగించారు. ఇలా వచ్చిన వారందరికీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆతిథ్యం ఏర్పాట్లు చూసుకున్నారు. మంత్రి హరీష్ రావు కూడా ఆయన ఇంట్లోనే బస చేశారు. రవిచంద్ర ఇంటి నుంచే సభ సక్సెస్ కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, పలు సబ్ కమిటీల ఇంచార్జ్ లతో అక్కడే సమీక్ష లు నిర్వహించారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఎంపీ రవిచంద్ర హరీష్ రావు వెంట ఉంటూ ఏ లోటు రాకుండా చూసుకున్నారు. అదే క్రమంలో జన సమీకరణ కోసం ఆయన ఇంచార్జిగా ఉన్న మధిర నియోజకవర్గ బాధ్యతలు కూడా పర్యవేక్షించారు. సభకు ముందు రోజు రాత్రే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లను ఖమ్మం చేరుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంగళవారం సాయంత్రానికే ఖమ్మం చేరుకున్న వారందరికీ ఆతిథ్య ఏర్పాట్లు రవిచంద్ర చూసుకున్నారు. దీంతో వీరంతా సభ సక్సెస్ అయి వెనుదిరిగి వెళ్తు రవిచంద్ర కు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement