వన దేవతలు సమ్మక్క, సారలమ్మలకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య ఈరోజు రవిచంద్ర మేడారం తల్లుల సేవలో గడిపారు. అమ్మవార్లకు చీరె, సారె, బెల్లం ముద్దలు నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఎంపీతో పాటు కుటుంబ సభ్యులను పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దగ్గరుండి సమ్మక్క, సారలమ్మల గద్దెలు, పగిడిద్దె రాజు, గోవింద రాజులను దర్శింపజేసి, తీర్ద ప్రసాదాలు అందజేశారు. మొక్కులు చెల్లింపు వేడుకకు ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల నుంచి వద్దిరాజు అభిమానులు, పలువురు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, జల వనరుల అభివృద్ధి మండలి చైర్మన్ వి.ప్రకాష్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య, నాయకులు పుట్టం పురుషోత్తం, రౌతు కనకయ్య, విష్ణు జగతి, ఆకుల గాంధీ, తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.