Tuesday, November 26, 2024

చంద్రుడిపై ఇస్రో అద్భుత విజ‌యం – రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మం, ఆగస్ట్, 23:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 విజయవంతమ‌వ‌డం చ‌రిత్ర‌లో అత్యంత అద్భుత విష‌య‌మ‌ని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై సునాయాసంగా అడుగిడింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది.

దీంతో చంద్రుడి పై మ‌న తొలి అడుగు ప‌డినట్లయింది. ఇది మ‌న విజయ కీర్తి పతాకంలో మరో మైలు రాయి వంటిదని అన్నారు. ఈ స్ఫూర్తితో భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాల‌కు అంకురార్ప‌ణ జ‌రగనుందని అభిప్రాయపడ్డారు. ఇది భార‌త జాతి గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యంగా రవిచంద్ర పేర్కొన్నారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు ఎంపీ శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement