Saturday, September 14, 2024

Khammam : సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండలం రైతు వేదిక కార్య‌క్ర‌మంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా 17మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని స్థానిక తహసీల్దార్ శకుంతల తెలిపారు. 17మంది లబ్ధిదారులకు 1,10,116ల చొప్పున మొత్తంగా 17లక్షల, 18,972 విలువ గల చెక్కులను అందజేశారు.

అనంతరం 2 సీసీ రోడ్లకు గాను 5 లక్షల 60 వేల చొప్పున, 11 లక్షల 20 వేల రూపాయలతో నిర్మించిన సీసీరోడ్లను శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం మండల, గ్రామ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల అధికారులు సరైన నివేదికలతో రాని వారిపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహించారు.

అనంతరం ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. మండల స్థాయి అధికారులు ఎలాంటి అలసత్వం వహించకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజల మధ్యన ఉంటూ సమస్యలు పరిష్కరించే, దిశగా కృషి చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. మండల వ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తినా త‌న‌ దృష్టికి వచ్చిన మండల స్థాయి అధికారులను ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డీటీ అనూష, రెవెన్యూ సిబ్బంది రామయ్య, బుల్లిబాబు, ఎంపీడీవో శ్రీను, ఎంపీఓ బత్తిని శ్రీనివాస్, మండల అధ్యక్షులు రామ నరసయ్య, అథాహర్, సమ్మయ్య, శ్రీకాంత్, శేఖర్, శ్రీనివాసరావు, సుధాకర్, ముత్తిలింగం, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్, స్థానిక ఎస్సై రతీష్ నేతృత్వంలో గట్టి బందోబస్తు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement