అశ్వరావుపేట, నవంబర్ 4 (ప్రభ న్యూస్): బీఆర్ఎస్ పార్టీ తరపున స్థానిక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే తరపున నామినేషన్ పత్రాన్ని వారిని బలపరిచిన వ్యక్తి అయిన దొడ్డా శ్రీరామ్మూర్తి శనివారం రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ పర్సా రాంబాబు కి సమర్పించడం జరిగినది.
ఈ నామినేషన్ అశ్వారావుపేట శాసనసభ స్థానానికి వచ్చిన మొదటి నామినేషన్. ఈ నామినేషన్ కార్యక్రమంలో తహసీల్దార్ వి.కృష్ణ ప్రసాద్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.