Saturday, November 23, 2024

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అజ‌య్‌

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఇంటింటా సిరిసంపదలు, ఆనందాలు నిండాలని మంత్రి అజయ్ ఆకాంక్షించారు. ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ పక్షుల కిలకిలా రావాలతో ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఉగాది ఆహ్వానం పలుకుతుందని మంత్రి తెలిపారు. రైతు కుటుంబాల జీవితాలలో వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెలలను నింపడమే సీఎం కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లను ఉగాది నుంచే రైతులు ప్రారంభిస్తారని, అన్నదాతలను వ్యవసాయానికి సంసిద్ధం చేసే ఉగాది రైతుల జీవితంలో భాగమైపోయిందన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మండే వేసవిలోనూ చెరువులను నిండుకుండలుగా మార్చి, రైతులకు పసిడి పంటలను అందిస్తున్నదని తెలిపారు. ఉమ్మడి పాలనలోని చేదు అనుభవాలను చవి చూసిన తెలంగాణ రైతు, స్వయంపాలనలో తియ్యటి ఫలాలను అనుభవిస్తున్నారని తెలిపారు. బ్యారేజీలు కట్టి, సొరంగాలు తవ్వి, లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి నదీజలాలను సాగరమట్టానికి ఎత్తుమీద ఉన్న సాగు బీల్లకు సీఎం కేసిఆర్ మళ్లించారని మంత్రి అజయ్ గుర్తుచేశారు. విమర్శకుల అంచనాలను తారుమారు చేసి పంటల సాగు, ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement