ఇల్లందు : ఈనెల 6న జరగబోయే తుక్కుగూడ భారీ బహిరంగ సభకు ఇల్లందు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య విజ్ఞప్తి చేశారు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారీ బహిరంగ సభకు ఏఐసీసీ నుంచి నాయకులందరూ హాజరై ప్రసంగిస్తారన్నారు. సభకు ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు హాజరు కావాలని విజ్ఞప్తి చేసారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement