Tuesday, October 1, 2024

KHM: ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేయాలి.. బీఆర్ఎస్ నేత‌ల రాస్తారోకో

బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా గురువారం మండల కేంద్రమైన ముదిగొండలో రైతుల పక్షాన తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా రైతుల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేత‌లు కొద్దిసేపు రాస్తా రోకోను నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎటువంటి షరతులు లేకుండా రైతుల రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని, రేషన్ కార్డు, పాస్ బుక్ లేకపోయినా రుణ‌మాఫీ చేయాలని వారు నినాదాలు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, నాయకులు పోట్ల వెంకటప్రసాద్, గడ్డం వెంకట్, తదితర నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసి అధికారంలోకి వచ్చిందని వారు ఆరోపించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామని, కానీ అమ‌లు చేయ‌డంలో విఫలం చెందారన్నారు. కేబినెట్ సమావేశంలో 31వేల కోట్ల అమలు చేస్తామని, కేవలం బడ్జెట్ లో పెట్టింది 26వేల కోట్లు మాత్రమేనని, మొన్నటి లెక్కల ప్రకారం 17,900 కోట్లకు గానూ, కేవలం 7500 కోట్లు మాత్రమే అమలు చేశారని, ఇంకా లక్షల్లో రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని వారు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి రుణమాఫీ అందరికీ వర్తింపజేస్తే తన పదవిని తృణప్రాయంగా వదులుకుంటానని సవాలు విసిరినా సవాల్ ను స్వీకరిస్తూనే.. ఇప్పుడు రుణమాఫీ అమలు చేయకపోవడంతో రాజీనామా ఎవరు చేయాలో చెప్పాలన్నారు. అనంతరం మండల త‌హ‌సీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ నాగలక్ష్మికి అందజేశారు.


మర్యాదపూర్వకంగా నూతన సీఐని కలిసిన బీఆర్ఎస్ ముదిగొండ మండల కమిటీ బృందం..
ముదిగొండ పోలీస్ స్టేషన్ ఉన్నతీకరణ చెందడంతో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఓ మురళిని బీఆర్ఎస్ ముదిగొండ మండల కమిటీ బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement