Friday, November 15, 2024

KHM: అందరికీ రుణమాఫీ అమలు చెయ్యాలి… పువ్వాడ అజయ్

రఘునాధపాలెం, ఆగస్టు 22(ఆంధ్ర ప్రభ) : రైతుల కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమ‌ని, ఈ దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రఘునాధపాలెం మండలం మంచుకొండ ప్రధాన రహదారి వద్ద పార్టీ పిలుపు మేరకు రైతులతో నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. రుణమాఫీ ఆంక్షలు లేకుండా అందరికీ అమలు చేయ్యాలని, లేని పక్షంలో ప్రజలే కాంగ్రెస్ మెడలు వంచుతారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ చిత్తశుద్ది లేని రుణమాఫీ అని, ఎంత మందికి రుణమాఫీ ఇవ్వాలో శాస్త్రీయంగా లెక్కలు లేకుండా చేశారన్నారు. రైతులు రుణాలు తీసుకుంటే రుణాల‌పై ఉన్న వడ్డి చేల్లిస్తేనే రుణమాఫీ అవుతుందని ఇప్పుడు అంటున్నారని మండిపడ్డారు. అనేక సాంకేతిక కారణాలు అని చెప్పుకుంటూ కాలం వెల్లబుచ్చుతున్నారన్నారు. నాడు కేసీఆర్ చేసినప్పుడు లేని సాంకేతిక సమస్యలు ఇప్పుడు ఎలా వస్తున్నాయని ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, అడ్డగోలు ఆంక్షలు, అర్థం లేని షరతులతో రైతులను మోసం చేస్తున్నారని పువ్వాడ అజయ్ మండిపడ్డారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మండల పార్టీ అధ్యక్షుడు వీరునాయక్, నాయకులు ఆర్జేసి కృష్ణ, బీరెడ్డి నాగచంద్ర రెడ్డి, మద్దినేని వెంకట రమణ, కూరకుల నాగభూషణం, గుత్తా రవి, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, నాగేండ్ల కోటి, మోతరపు శ్రావణి, పగడాల శ్రీ విద్య, కూరాకుల వలరాజు, ధోన్ వాన్ సరస్వతి, దండా జ్యోతి రెడ్డి, కన్నం ప్రసన్న, దానాల శ్రీకాంత్, తోట వీరభద్రం, దేవభక్తిని కిషోర్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు తాజ్ మాజీ కార్పొరేటర్లు మచ్చ నరేందర్, నర్సింహారావు, దడాల రఘు, మండల పార్టీ నాయకులు మాజీ ఆత్మ చైర్మన్ లక్ష్మణ్, పిన్ని కోటేశ్వరరావు, చిన్నబోయిన సైదులు, హరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement