ఖమ్మం పాలిటిక్సకు కేటీఆర్ మార్క్ ట్రీట్మెంట్
అటు ప్రగతి సంతకం… ఇటు రాజకీయ యంత్రాంగం
రాజకీయంగా నాలుగు స్తంభాలాట
పువ్వాడ, తుమ్మల, పొంగులేటి, నామా… కలవని దిక్కులు
దిగ్గజ నేతల మధ్య సయోధ్యకు యత్నం
కేసీఆర్ సూచనలతో రంగంలోకి కేటీఆర్
ఖమ్మం కార్పొరేషన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా వ్యూహం
నేడు ఖమ్మం జిల్లాలో యువనేత కేటీఆర్ పర్యటన
హైదరాబాద్/ఖమ్మం, : యువనేత, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామా రావు నేడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నా రు. ఖమ్మం రాజకీయాలు.. ఇతర జిల్లా లకు భిన్నం. గత అసెంబ్లి ఎన్నికల్లో.. రాష్ట్రమంతా ఒక తీర్పువస్తే.. ఖమ్మం జిల్లాలో మరో తీర్పు వచ్చింది. దీనిపై తీవ్ర ఆగ్రహంతో.. సీఎం కేసీఆర్ చేసిన ప్రక్షాళన ఎఫెక్ట్ రెండేళ్ళుగా జిల్లా రాజ కీయాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ హవా సాగుతోంది. ఖమ్మం చరిత్రలో నిలిచిపోయే (మొదటిపేజీ తరువాయి)
నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టి పూరి ్తచేయిం చడంతో పాటు ఇంకా ఇతర అనేక అభివృద్ది కార్య క్రమాలను పువ్వాడ పట్టుబట్టి చేయిస్తున్నారు. ఖమ్మం ఐటీ హబ్ తొలిదశ సూపర్ సక్సెస్ కాగా, రెండో దశకు శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. ఖమ్మంతో పాటు సత్తుపల్లిలోనూ.. మంత్రి పర్యటన ఉంది. ఖమ్మం నగరంపై పువ్వాడ తనదైన మార్కు అభివృద్ధిని చూపిస్తున్నారు. గత పర్యటనలో ఖమ్మం కార్పోరేషన్ వీధులు, నిర్వహణ చూసి.. మంత్రి కేటీ ఆరే ఆశ్చర్యపోయి ప్రశంసల జల్లు కురిపించారు. ఇది ఓ కోణం. త్వరలో ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ ఎ న్నికలు జరగనుండగా, ప్రజలను ఆకట్టుకునేందుకు.. చెప్పిన హామీలే కాకుండా చెప్పనివి కూడా చేసే సామ ర్ధ్యం టీఆర్ఎస్కే ఉందన్న భావన ప్రజల్లో కలిగించే ప్రయత్నం ఈ పర్యటన ద్వారా చేయనున్నారు. ఇదో కోణం. ఈ పర్యటన ద్వారా ఖమ్మం రాజకీయాలకు తనదైన మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చి.. ఖమ్మం కార్పో రేషన్ ఎన్నికల విజయం దిశగా నేతలందరినీ ఏకోన్ముఖంగా కదిలించే మరో వ్యూహం ఉంది.
అందరూ హేమాహేమీలే
ఖమ్మం రాజకీయాల్లో గత టర్మ్‌లో తుమ్మల నా గేశ్వరరావు హవా నడిచింది. సీనియర్ మంత్రిగా ఉమ్మడి జిల్లాపై తిరుగులేని అభివృద్ధి ముద్ర వేశారు. అయితే 2018 అసెంబ్లి ఎన్నికల్లో తాను ఓడిపోవ డంతో పాటు మొత్తం జిల్లాలో టీఆర్ఎస్ ఒకే ఒక్క అసెంబ్లి స్థానం గెలవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత మరే అవకాశం రాలేదు. తుమ్మలకు జిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉంది. ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో తుమ్మల ఓ బలమైన నేత. అయితే మంత్రి పువ్వాడకు, తుమ్మలకు మధ్య గ్యాప్ ఉంది. గతంలో దీనిని సరిచేసే ప్రయత్నాలు అధి ష్టానం చేసినా అవి సరికాలేదు. ఇటీవల కాలంలో గ్యాప్ మరింత పెరిగింది. ఒకరిపై ఒకరు బహిరం గంలో విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది. ఇందుకు ఎవరి కారణాలు వారి అనునాయులు చెబుతున్నారు. ఇక తుమ్మల ఓటమి.. తదనంతర పరిణామాలపై కేసీ ఆర్ ఆగ్రహించడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ నిరాకరించారు. పొంగులేటికి జిల్లా వ్యా ప్తంగా అనుచరగణం ఉంది. వైసీపీ నుండి పోటీచేసి తాను ఎంపీగా గెలవడంతో మూడు అసెంబ్లి స్థానా లను 2014 ఎన్నికల్లో గెలిపించారు. టీఆర్ఎస్లో చేరిన తర్వాత రాజకీయంగా వృద్ధి చెందిందేమీ లేదు. ఖమ్మం జిల్లాలో ఓటమిపై అప్పట్లో కేసీఆర్ ”మా వాళ్ళే.. ఒకని కత్తి మరొకనికి తగిలి పోయారు” అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా అదే మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పార్టీ గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రిగా అవకాశమిచ్చారు. గత ఏడాదికాలంగా ఆయన నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా.. అభి వృద్ధి నినాదంతో ముందుకు వెళుతున్నారు. ఈ ఇద్ద రు నేతలకు రెండేళ్ళుగా పార్టీ ఏ అవకాశం లేకపో వడంతో వీరి అనుచరులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎక్కడికక్కడ కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు పట్టుబిగుస్తుండడంతో వీరి వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో ఖమ్మం మునిసిపల్ కార్పో రేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పార్టీనేతలు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరముంది.
ఇక ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ కార్యకలా పాలకు సంబంధించి అంటీముట్టనట్లుగా వ్యవహ రిస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఖమ్మం రాజకీ యాలు, నేతల పోకడలు గ్రహించిన అధినేత.. శుక్ర వారం తనదైన మార్క్ ట్రీట్మెంట్తో అందరినీ ఖుష్ చేస్తారని, అపోహలు తొలగించి భరోసానిస్తారని చెప్పు కుంటున్నారు. గతంలోనే పలుమార్లు.. కేటీఆర్ పని చేసే వారెవరో.. పనిచేయని వారెవరో నాకు తెలుసు. అందరి చిట్టాలు నా దగ్గర ఉన్నాయని చెప్పారు. ఇపు డు కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎవరిని ఏరకంగా డీల్ చేయబోతున్నారన్న అంశం.. ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్‌కు నివేదిక
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేతల పనితీరుపై.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివిధ పద్ధ తుల్లో నివేదికలు అందాయి. ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు సొంత వేగుల ద్వారా ఖమ్మం పాలిటిక్స్‌పై నివే దిక తెప్పించుకున్నారు. అంతా బాగున్నట్లే అని పించినా.. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యనేతలే షాకిచ్చారు. ఈ ప్రాంతపై అవగాహన ఉండడంతో పాటు సీఎంకు సన్నిహితంగా ఉండే నేతగా పేరున్న పల్లా రాజేశ్వ రరెడ్డికే కొందరు నేతలు సహకరించకపోవడం అధినేతను ఆశ్చర్యపరిచింది. సీఎం కేసీఆర్ సూచనల నేపథ్యంలోనే.. శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన తర్వాత ఖమ్మం రాజకీయాలకు సంబం ధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అధినేత కేసీఆర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. అంతా బాగున్నట్లే కనిపించినా.. అసలు విషయానికి వచ్చే సరికి వెన్నుపోట్లు ఖమ్మం రాజకీయాల్లో కామన్. పార్టీలతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా ఈ కల్చర్ ఖమ్మం పాలిటిక్స్‌లో ఉంది. త్వరలో ఖమ్మం కార్పో రేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఏ ఎఫెక్ట్ లేకుండా కార్పోరేషన్‌ను స్వీప్ చేసేందుకు కేటీఆర్ తన దైన చాణక్యం ప్రదర్శించబోతున్నారు. కేటీఆర్ పర్య టనపై.. ఖమ్మం రాజకీయ వర్గాల్లోనే కాక సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.