ఖమ్మం : నష్టాలలో బాటలో ఉన్న ఆర్టీసీ ఇప్పడిప్పుడే లాభాల బాట పట్టిస్తున్నామని, ఇందులో సిబ్బంది కృషి ఎంతో ఉందని అన్నారు మంత్రి కెటిఆర్…ఖమ్మంలో రూ. 25 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కలిసి ప్రారంభించారు. కొత్త నిర్మించిన బస్టౌండ్ మొత్తం 30 ఫ్లాట్ ఫామ్స్ తో పాటు ప్రయాణీకులకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించారు.. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఆర్టీసీని కూడా బలోపేతం చేస్తూ లాభాల బాటలో పయనింపజేసేందుకు కార్గో లాంటి సర్వీసులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. ఆర్టీసీని మరింత లాభాల్లోకి తీసుకొస్తే.. మిగతా నగరాల్లోనూ ఆధునికమైన బస్టాండ్లను ఏర్పాటు చేసేందుకు వీలుంటుందన్నారు. అలాగే ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆ సంస్థ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ జీతాలు పెంచే ఆలోచనలో ఉన్నారని వెల్లడిచారు.. అలాగే ఖమ్మం పట్టణాన్ని మంత్రి పువ్వాడ అజయ్ అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.. గాంధీ కూడలిని అద్భుతంగా సుందరీకరించారు. గత ఏడేళ్లుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర పట్టణాల ప్రజాప్రతినిధులు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఖమ్మంలో ఇప్పటికే ఒక సమీకృత మార్కెట్ ఉంది.. మరో మూడు కావాలన్నారు తప్పకుండా మంజూరు చేస్తామన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో ప్రజల ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం ఎన్నో మాటలు చెప్పిందని.. కానీ నిలబెట్టుకోవడం లేదని అన్నారు కెటిఆర్.. జీఎస్టీ బకాయిలు మన దగ్గర తీసుకోవడమే తప్ప తిరిగి ఇచ్చింది ఏం లేదు అని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement