Tuesday, November 26, 2024

రైతుల దాహార్తి తీరుస్తున్న ఖమ్మం మార్కెట్ కమిటీ

ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దొరేపల్లి శ్వేత రైతులకు, మార్కెట్ కార్మికులకు మండుటెండలో మజ్జిగ ప్యాకెట్లు అందిస్తూ వారి దాహార్తిని తీరుస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బ‌ర్త్ డే రోజు నుండి ప్రారంభించిన ఈ మజ్జిగ పంపిణీ నిర్విరామంగా కొనసాగిస్తూ రైతులు, మార్కెట్ కార్మికుల నుండి అభినందనలు అందుకుంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రాష్ట్రంలోనే మిర్చి పంటకు పెద్ద రెండవ మార్కెట్ గా పేరు ఉంది. ఈ మార్కెట్ కు ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రైతులతో పాటు మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు చెందిన, కోదాడ ప్రాంతానికి చెందిన రైతులు మిర్చి పంటతో వస్తుంటారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాకు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ప్రాంతాలకు చెందిన రైతులు కూడా మిర్చి పంటను తెస్తుంటారు. మారు 15వేల మంది రైతుల వరకు మార్కెట్ కు వచ్చి పోవడం జరుగుతుంది. రైతుల సౌకర్యం కోసం ఇప్పటికే కూలింగ్ తో మినరల్ వాటర్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసిన పాలకవర్గం తాజాగా మజ్జిగ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలిచింది. ఖమ్మం మార్కెట్ కమిటీ పాలకవర్గంతో పాటు వర్తక సంఘం , ఎగుమతి, దిగుమతి శాఖలు, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు వితరణగా పంపిణీ చేస్తున్నారు. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్ష మల్లేశం, గ్రేడ్ 2 సెక్రటరీ బి. బజార్ సారథ్యంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దొరేపల్లి శ్వేత స్వయంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తూ మండుటెండ లో ఎండ వేడి తగలకుండా వారి దాహార్తిని తీరుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement