Tuesday, November 26, 2024

KHM: పేకమేడలా కూలిన ఖమ్మం గ్రంథాలయం.. తప్పిన పెనుప్రమాదం

ఖమ్మంలోని జిల్లా గ్రంథాలయం భవనం ఇవాళ పేకమేడలా కుప్పకూలిపోయింది. ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ ప్రక్కన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న జిల్లా గ్రంథాలయం కాలం చెల్లింది కావటంతో ఒక్కసారిగా కూలిపోయింది.

దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఇవాళ సెలవు కావడంతో పత్రిక విభాగంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అప్రమత్తం చేసి అనంతరం పరీశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement