ఖమ్మం : గిరిజనులకు 10% రిజర్వేషన్లను పెంచడానికి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. మన సీఎం కేసీఆర్ కొమురం భీమ్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు అన్నారు. ఆదివాసుల పోడు భూముల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అన్నారు. హైదరాబాదులో ఆదివాసి బంజారా భవనాలను నిర్మించి అడవి బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలిపారని, తాజాగా రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి గిరిజనుల మనసు గెలుచుకున్నారు. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి రంగాలలో అవకాశాలు కలుగుతున్నాయి అన్నారు. గిరిజనుల కోసం అనేక పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ మనందరి మనసు గెలుచుకుంటున్నారు అన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచడం చరిత్రలో నిలిచిపోతుంది, ఎస్టీలకు గురుకురాల ఏర్పాటుతోపాటు మిషన్ భగీరథ ద్వారా మారుమూల గ్రామాలకు సైతం తాగునీళ్లు అందిస్తున్నారన్నారు.