Friday, November 22, 2024

పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి ఆసరా : మంత్రి పువ్వాడ

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క‌ల్యాణ‌ల‌క్ష్మి పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకం ద్వారా మంజూరైన 31 మందికి రూ.31 లక్షల విలువైన చెక్కులను మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు.

ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు. కార్యక్రమంలో మేయోర్ పునుకొల్లు నీరజ, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు, జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, MRO శైలజ, కార్పొరేటర్ లు కమర్తపు మురళి, రుద్రగాని శ్రీదేవి, తోట దనమ్మ, సరస్వతి, నాయకులు బొమ్మెర రాంమూర్తి, AMC చైర్మన్ లక్ష్మిప్రసన్న తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement