భద్రాచలం (టౌన్) నవంబర్ 10 (ఆంధ్రప్రభ) : భద్రాచలం సిపిఐకి భారీ షాక్ తగిలింది.. ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రావులపల్లి రాం ప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు..ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు,తెల్లం వెంకటరావు శుక్రవారం సిపిఐ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రావులపల్లి రాంప్రసాద్ స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన ఆయన రేపు హైదరాబాదులో కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నట్లు సమాచారం.
కాగా, రాంప్రసాద్ తండ్రి రావులపల్లి నాగభూషణం భద్రాచలం నియోజకవర్గంలో సిపిఐ పార్టీ వ్యవస్థాపకులు. అతను సోదరుడు రావులపల్లి రవికుమార్ సిపిఐ లో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. రాంప్రసాద్ తో పాటు పట్టణ కార్యదర్శి ఆకోజి సునీల్ తదితరుల రేపు బిఆర్ఎస్ పార్టీ కండవు కప్పుకోనున్నారు. ఇటీవల సిపిఐ పార్టీ కీలక నేత తమ్మళ్ళ వెంకటేశ్వరరావు, మరికొందరు నాయకులు సిపిఐ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.. ఇంతలోపే రావులపల్లి సిపిఐ కి గుడ్ బై చెప్పడంతో సిపిఐ కి భారీ షాక్ అని చెప్పాలి…